శ్లో సౌరాష్ట్రే సోమనాధంచ , శ్రీశైలే మల్లికార్జున మ్ ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్ కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే
పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత లింగాలు. అనంతమైన తేజస్సుతో , వేదకాలమునాటికి పూర్వంనుండి భక్తజనాన్ని తరింప చేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు ".
1. సౌరాష్ర (గుజరాత్) దేశంలో సొమేశ్వరుడు.
2. ఆంధ్రప్రదేశములోని శ్రీ శైలంలో మల్లికార్జునుడు.
3. ఉజ్జయినిలో(మద్య ప్రదేశ్) శిప్రా నది తీరాన మహా కాలేశ్వరుదు
4. మాలవ్యదేశంలొ(మద్య ప్రదేశ్) నర్మదానది తీరాన ఓంకారేశ్వరుడు
5. హిమాలయాల్లో(ఉత్తరాంచల్) మందాకినీ శిఖరాన కేదారేశ్వరుడు
6. ఢాకిని నగరాన(మహా రాష్ట్రం) భీమశంకరుడు
7. కాశీ క్షేత్రంలో(ఉత్తర ప్రదేశ్) గంగానది తీరాన విశ్వేశ్వరుడు
8. సహ్యగిరి శిఖరాలలొ మహా రాష్ట్రం) నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మ స్థలాన త్రయంబకేశ్వరుడు
9. ఉత్తర భారతదేశంలో(మహా రాష్ట్రం) చితభూమియందు వైద్యనాధుడు. 10. దారుకావనము సమీపంలో(గుజరాత్) గోమతీ నది వద్ద నాగేశ్వరుడు. 11. సేతుబంధము(తమిళనాడు) వద్ద రామేశ్వరుడు
12. ఎల్లోరా గుహలవద్ద(మహా రాష్ట్రం) ఘృశ్శేశ్వరుదు.
1. సోమనాధ స్వామి :
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటది " సోమేశ్వర లింగం " . ఇది మిక్కిలి ప్రఖ్యాతి చెందిన
పురాతనమైన శైవ క్షేత్రం . పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌ రాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో
ఈ ఆలయం ఉన్నది . సరస్వతీ నది ఇక్కడ సాగర సంగమం చేస్తుంది . ఈ సాగర సంగమంలోనే చంద్ర భగవానుడు స్నానం చేసి ,
శివారాధన చేసి , శాప విముక్తి పొందినాడు .
దక్ష ప్రజాపతి కుమార్తెలు నూరుమంది. అందరిలోనూ పెద్ద
కుమార్తె "సతీదేవి" శివుని భార్య . మిగిలిన కుమర్తెలలొ
27 మందిని (అశ్విని , భరణి మొదలగు నక్షత్రములు) చంద్రునుకి ఇచ్చి వివాహం చేశాడు . సవతులు అందరిలోనూ చిన్నదగు రేవతి యందు చంద్రునుకి మిక్కిలి ప్రేమ యుండుట వలన , మిగిలిన వారు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు . అంతట దక్ష ప్రజాపతి చంద్రునకు "క్షయ వ్యాధిని పొందు" అని శాపం ఇచ్చాడు . నారద ముని సలహాతో , చంద్రుడు ప్రభాసమునకు పోయి 40 దినములు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు . అంత పర్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై , ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ట చేసి , పూజించిన , నీకు శాపఫలం క్షీణించగలదు. మొదటి 15 దినములు నా వర ప్రభావంబున వృద్ది పొంది , తరువాత 15 దినములు దక్ష ప్రజాపతి శాప ఫలంబున క్షీణించగలవు అని తెలియజేసాడు . చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది . సోముడు చేత అర్పించబడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది . ఈ సోమేశ్వరలింగాన్ని పూజించే వారికి సకల పాపములు , క్షయ మొదలగు వ్యాధులు తొలగిపోతాయి .

0 comments:

Blog Archive

About me