దత్తావతారములు మొట్టమొదటిగా ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ యొక్క జగత్తును సృస్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయని నాభినుంచి ఒక కమలము, దాని నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ శ్రీ మహవిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి, ఆయన నుంచి వెలువడిన వేదాలలొ వివరించిన విధముగా ఈ విశ్వమంతటిని సృస్టించాడు. మొదట ఆయన బ్రహ్మ నిష్టులైన సనక, సనందన, సతత, సనత సజాతులను, ఆ తరువాత ప్రజా పతులైన మరీచి, అత్రి, కురు, అంగీరస, పులహా, పులస్త్య, క్రతు , వశిస్టులను సృస్టించాడు. తదుపరి ముల్లొకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృస్టించాడు. వారి వారి పూర్వ జన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే నాలుగు యుగాలను సృస్టించి క్రమ పద్దతిలొ వాటిని భూమిపై ప్రవర్తింపజేసాడు. మొట్టమొదటిగా కృత యుగాన్ని భూలొకంలో పదిహేడు లక్షల ఇరువది ఎనిమిది వేల సంవత్సరములు ప్రవర్తించమని ఆదేశించాడు. తదుపరి త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పదురెండు లక్షల తొంబది యారు వేల సంవత్సరములు తమ ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. తదుపరి ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది వందల అరువది నాలుగు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. ఆ తరువాత కలియుగాన్ని పిలిచి భూమిపై నాలుగు వందల ముప్పది రెండు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. ఈ కలి పురుషుడు మలినుడు. తగవులంటె అతనికి ఎంతో ఇస్టం. కృరుడు, వైరాగ్యమే లేని వాడు. పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితొ తన మర్మావయాన్ని, కుడి చేతితొ నాలుకను పట్టుకొని పిశాచ రూపముతొ గంతులు వేస్తూ వచ్చాడు. అతనిని చూచి బ్రహ్మ అతని వికృత చేస్ఠలకు అర్థమేమి అని అడిగినాడు. అపుడు కలి పురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్య చాపల్యము గల వారు గాను చేసి వారు ఉత్తమ గతులు పొంద కుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనెను. అపుడు బ్రహ్మ అతను భూమిపై సంచరించ వలసిన కాలము తెలుపగా, ఆ కలి పురుషుడు భయపడి స్వామీ! నాకు ధర్మాన్ని, శాస్త్రాన్ని అతిక్రమించి స్త్రీ పుత్ర ధన వ్యామొహములలో చిక్కి ప్రవర్తించే వారంటే నాకెంతొ ఇష్టం. ధర్మాన్ని పాటించే వారంటే నాకు భయము. ఎందరో ధర్మ పరులున్న భూలొకానికి వెళ్ళి నేనెలా నా ధర్మాన్ని ప్రవర్తింపజేయగలను. అటువంటి వారిని చూస్తేనే నాకు భయంతో నాకు వణుకు పుడుతోంది. అపుడు బ్రహ్మ కలిపురుషుడిని చూసి, నీవు భూలోకంలో ధర్మాన్ని పాటించే వారిని వదలిపెట్టి, అధర్మాన్ని పాటించే వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. అద్వైత సిద్దాంతాన్ని, తల్లి, తండ్రి, గురువులను పూజించి సేవించే వారిని, గోవు తులసిలను పూజించే వారిని, వేద శాస్త్ర పురాణ స్ర్ముతులను పాటించే వారిని నీవు భాదించవద్దు. ప్రత్యేకించి గురు భక్తులను నీవు ఏమి చేయజాలవు. కాబట్టి నీవు వారిని బాధించవద్దు. అపుడు కలిపురుషుడు ఈ గురువు అనగా ఎవరు, అట్టి అవతారము గురించి తెలియజేయమని అడుగగా అపుడు బ్రహ్మ ఈ విధముగా చెప్పసాగెను.
.
పూర్వము సూర్య వంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరి చింతన, అతిధి సేవలతొ పాటు ద్రుఢమైన నిష్ఠతొ ఏకాదశ వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిధి ఒక్క ఘడియ కాలముందనగా దూర్వాశ మహర్షి శిష్య ప్రశిష్యులతొ కలిసి అతని వద్దకు వచ్చెను. అంబరీషుడు అయనను పూజించి త్వరగా అనుస్టానము పూర్తిచేసుకొని భొజనానికి రమ్మని ప్రార్దించెను. అపుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి సమయం మీరి పోతున్నా రాకుండా ఆలస్యం చేయసాగెను. తిధి మించిపోయిన అంభరీషునికి వ్రత భంగం అవుతుంది. అలా అని అతను భొజనం చేస్తె అతిధిని అలక్ష్యం చేసినట్టు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు. అతడు తీర్థం తీసుకొనే సమయంలో దూర్వాశ మహాముని వచ్చి కోపించి రాజా! నీవు నానా యోనులలో జన్మింతువు గాక! అని శాపమిచ్చాడు. అంబరీషుడు భయపడి తన దైవమైన శ్రీహరిని శరణు పొందగా అపుడాయన సాత్కాక్షరించి దుర్వాశ మహామునితో నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయమని అన్నాడు. అపుడా దుర్వాశ మహాముని, ఈ శాపకారణంగా అయినా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోపోపకారము చేయగలడని తలచి సంతొషంతో ఓ విశ్వాత్మా! మీ గురించి తపస్సు చేస్తూ యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికిపాపులను ఉద్దరించడానికి మీరు భూలొకంలో ఎప్పుదూ అవరరిస్తూ ఉండండి అని అన్నాడు.అందువల్లే విష్ణువు మత్యాది అవతారలెత్తాడు.
.
ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రెయుడు. ఆయన అత్రి అనసూయలకు జన్మించాడు. ఆయన శతరూప, మనువుల కుమార్తె అయిన దేవభూతి కర్దమ మహర్షి భార్య అయినది. ఆమెకు కలిగిన కుమార్తెలలొ అనసూయదేవి అత్రి మహర్షి భార్యయై మహా ప్రతివ్రతగా ప్రసిద్దికెక్కినది. ఆమె ప్రాతివ్రత్య ప్రభావానికి దేవతలందరూ తమవలన ఆమెకు కస్టం కలిగినా, ఏ అల్పుడైన ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను జయింపగలడని భయపడుతుండేవారు.ఒకసారి త్రిలొక సంచారియగు నారదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయ దేవి గురించి, ఆమె ప్రాతివ్రత్యము గురించి ప్రశంచించాడు. అపుదు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె ప్రాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను కోరారు. అపుడు ఆ త్రిమూర్తులు అతిధి వేషములతో అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళగా అనసూయ దేవి వారికి స్వాగతం పలికి మీ రాక చేత మా అశ్రమం పావనమైనది. నేను మీకు ఏ విధముగా సేవ చేయగలనొ తెలియజేయండి. అత్రి మహర్షి తపస్సు కొరకు అరణ్యంలోనికి వెళ్ళారు అని తెలియజేసినది. అపుడా అతిధులు మీ భర్త వచ్చేదాకా మాకు సమయం లేదు కావున మాకు భోజనం పెట్టు అన్నారు. అప్పుడు ఆమె విస్తళ్ళు వేసి భోజనానికి పిలువగా వారు ఓ సాధ్వి నీ ఆతిధ్యమును మేము స్వీకరించవలెనన్న మాకు ఒక షరతు ఉన్నది. అది ఏమనగా నీవు వంటిపైన ఒక్క నూలు పోగు లేకుండా నగ్నంగా వడ్డిస్తేనే మేము భొజనం చేస్తాo లేకుంటె వెళ్ళిపోతాము. అపుడు ఆమె మనస్సులో అతిధులను నిరాకరిస్తే గ్రుషస్తుల పుణ్యాన్ని, త్రపస్సును పోగొట్టుకొనునట్లు అవుతుంది కాని పర పురుషుల యెదుటకు నగ్నంగా వస్తే ప్రాతివ్రత్య భంగమవుతుంది కావునా ఈ పరస్పర విరుద్ధ భావలతో తనను పట్టింపజూసిన వారు సామాన్యులు కాదని భావించి మనస్సులో ఆకలిగొని అన్నం అడిగినవారు వీరు, ధర్మాన్ని అనుసరించి నా బిడ్డలే కాని పరపురుషులు కారు అని మనస్సులో భర్తయొక్క అనుమతి కూడి నగ్నంగా భొజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆమె యొక్క ప్రాతివ్రత్య సంకల్పం వలన వారు ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు స్తన్యము రాగా ఆ బిడ్డలకు త్రుప్తిగా పాలిచ్చినది. ఆమె ప్రాతివ్రత్య మహిమను గ్రోలి ఆ ముగ్గురు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆమె తిరిగి వస్త్రములు ధరించి తన దివ్యద్రుష్టితో ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యలలో పెట్టి నిద్రపుచ్చెను. అప్పుడు అత్రి మహర్షి వచ్చి జరిగినదంతా తెలుసుకొని ఆ త్రిమూర్తుల స్త్రొత్రం చేయగా వారు తమ నిజరూపాల్లొ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ దంపతులు ఆ త్రిమూర్తులే తమకు పుత్రులుగా జన్మించమని ప్రార్దించెను. అపుడు ఆ త్రిమూర్తులు ఆమెకు వరం అనుగ్రహించి తమ తమ లోకములకు వెడలిరి. ఆతరువాత వారిరువురికి ముగ్గురు కుమారులు జన్మించారు. అందులో విష్ణువుకి దత్తుడు అని, బ్రహ్మకి చంద్రుడు అని, రుద్రునకు దుర్వాసుడు అని నామకరణం చేసారు. ఆ ముగ్గురు అత్రి యొక్క సంతానం కాబట్టి ఆత్రేయులని, దత్తుడిని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. తరువాత చంద్రుడు, దుర్వాసుడు తమ దివ్యాశలను దత్తాత్రేయునందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెడలిరి. ఆ దత్తాత్రేయుడు మాత్రం అలనాటి దుర్వాశ శాపాన్ని అనుసరించి భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. సర్వజనొద్దరణే దత్తవతార కార్యము సృస్టి ఉన్నంత కాలము కొనసాగవలసినదే. కనుక దత్త స్వామి అవతార త్యాగము చేయకుండా నిరంతరము భూమిపై సంచరిస్తూ ఉంటాదు. అలాగే ఈ కలియుగంలో ఇప్పటికి నాలుగు సార్లు అవతరించాడు.
.
దత్తాత్రేయుని అవతారములు
శ్రీపాద శ్రీ వల్లభ
శ్రీ నరసింహ సరస్వతి
శ్రీ స్వామి సమ్మర్థ అక్కళ్ కొట మహారాజ్
శ్రీ షిర్డి సాయిబాబా
1 comments:
-
Shri Dattaswami
on
April 5, 2008 at 4:09 PM
మీరు దత్తాత్రేయులవారి గురించి చక్కగా చెప్పారు. మీరు అవకాశమిస్తే, ఇంకా చాలా చాలా దత్త తత్త్వము గురించి మనము చర్చించవచ్చు.
బ్రహ్మ - విష్ణు - శివ ముఖములతో త్రిలోకములను, సృష్టించి పాలించి లయింపచేయువాడును, ఒకే ఒకడుగ శ్రీ దత్తుడే బ్రహ్మమని వేదములో చెప్పబడినది. బ్రహ్మ - విష్ణు - శివ రూపములలోనున్న ఆ బ్రహ్మమే అనేక మానవ రూపములెత్తి భక్తులకు సేవాభాగ్యము కలిగించు చున్నాడు. మనము యీ బ్రహ్మ, విష్ణు, శివ రూపాలను energetic incarnations గా గుర్తించాలి. అదే పరబ్రహ్మము మానవ రూపములో ఉన్నప్పుడు మానవ అవతారము లేక human incarnation గా గుర్తించాలి. శ్రీ దత్తుడు ఎన్నో మానవ అవతారములలో వచ్చియున్నాడు. అందువలన, రాముడు, శ్రీ కృష్ణుడు, శంకర, రామనుజ, మధ్వా చార్యులు, వేంకటేశ్వరుడు, నృసింహ సరస్వతి, షిరిడీ సాయిబాబా, అక్కల్‌కోట మహారజ్, శ్రీ పాద వల్లభుడు, రామకృష్ణ పరమహంస మొదలగు యీ అవతారములన్నియు దత్తావతారములే.
ఒకే దేశమున ఒక కాలములో ఒక అవతారము ద్వారా బోధించిన దత్త తత్త్వమునే అదే సమయమున అన్ని అవతారముల ద్వారా అన్ని దేశములందు దత్త స్వామి బోధించుచున్నడు. ఇది నిజము కాకున్నచో ఒక సమయమున ఒక దేశమున మాత్రమే బోధించినచో ఆ సమయమున ఇతర దేశములనున్న అదే తరములవారికి అన్యాయము జరిగి స్వామికి పక్షపాతదోషము కలుగును కదా. అందువలన, క్రిష్టియన్స్, ముస్లిమ్స్ ఆరాధించే జీసస్ మరియు ప్రాఫెట్ మొహమ్మద్ గూడా శ్రీ దత్తవతారములే. శ్రీదత్తుడు తను మళ్ళీ మళ్ళీ వస్తానని (శ్రీ కృష్ణ రూపములో) చెప్పాడు గదా.
మానవ జీవత ధ్యేయము ఏమనగా అటువంటి శ్రీ దత్తావతారమును తన జీవిత కాలమునందు గుర్తించి సేవ (direct worship) చేయటము. శ్రీ దత్తవతారమును, మనము శాస్త్రాల (scriptures like Vedas, Gita, Bible etc) యొక్క సారమును తెలుసుకొని, మనకున్న బుద్ధిని ఉపయోగించి గుర్తించాలి. అంతేగాక గొప్ప భక్తుల జీవిత చరిత్ర తెలుసుకొని వారు గుర్తించిన విధముగ మనము కూడా మన కాలమునందున్న ఆ సద్గురువుని గుర్తించాలి. నిజమయిన సద్గురువు యగు శ్రీ దత్తుడిని గుర్తించిన తరువాత కర్మ సన్యాసము (దేవుని కొరకు నీ పనిని (కష్టాన్ని) త్యాగము చేయటం), కర్మ ఫల త్యాగం (కష్టపడి సపాదించిన దానిలో కొంత భాగము దేవుని కార్యము కొరకు త్యాగము చేయటం) ద్వారా సేవ చేయాలి. ఇది పూర్వపు గొప్ప భక్తుల జీవిత చరిత్ర చుస్తే మనకు గోచరిస్తుంది. ఉదా|| హనుమంతుడు, వానరులు, గోపికలు, రాధ, వివేకానంద, సాయిబాబా ని సేవించిన అతి కొద్ది గొప్ప భక్తులు మొదలగు వారు.
At lotus feet of Shri Dattaswami
-Durgaprasad
http://telugu-bhaktiganga.blogspot.com ;
http://www.esnips.com/user/dattaswami